Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్టు..
Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మందిని అరెస్టు చేశామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.;
Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మందిని అరెస్టు చేశామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. మొత్తంగా ఇప్పటివరకూ 44 మందిని అరెస్టు చేశామన్నారు. 20 వాట్సాప్ గ్రూప్స్ ద్వారా విధ్వంస రచన చేసినట్లు చెప్పారు. అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుంచే రాబడతామన్నారు. నిందితుల ఆస్తులను సీజ్ చేస్తామన్నారు. వీడియో, సీసీ టీవీ ఫుటేజీ, టవర్ లోకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ మరో వారం రోజడులు పొడిగిస్తున్నామన్నారు. ఇంటర్నెట్ సేవలు సైతం మరో రోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.