AP CORONA : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!
AP CORONA : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసులు.. తాజాగా 6వేలకు దిగువున నమోదయ్యాయి.;
AP CORONA : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసులు.. తాజాగా 6వేలకు దిగువున నమోదయ్యాయి. గత 24 గంటల్లో 25వేల 284 శాంపిల్స్ పరీక్షించగా 5వేల 879 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ వల్ల మరో 8మంది మృతి చెందారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, కృష్ణ, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున కరోనాతో మరణించారు. మరోవైపు 11వేల 384 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం లక్షా 10వేల 517 యాక్టివ్ కేసులు ఉన్నాయి.