Konaseema District: ఒంటరిగా 60 ఏళ్ల వృద్ధుడి పాదయాత్ర.. ఊరికి బస్సు బ్రిడ్జ్ నిర్మించడమే లక్ష్యం..
Konaseema District: తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలని 60 ఏళ్లు పైబడ్డ వృద్ధుడు ప్లకార్డ్ చేతపట్టి పాదయాత్ర చేపట్టారు.;
Konaseema District: తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలని సంకల్పంతో మండుటెండను కూడా లెక్క చేయకుండా 60 ఏళ్లు పైబడ్డ వృద్ధుడు ప్లకార్డ్ చేతపట్టి పాదయాత్ర చేపట్టారు. బస్సు బ్రిడ్జి నిర్మించాలని అధికారులను కోరుతున్నారు కోనసీమ జిల్లా కోటిపల్లికి చెందిన రేవు అమ్మాజీరావు. కోటిపల్లి - ముక్తేశ్వరం గోదావరి నదిపై బస్సు బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతూ కోటిపల్లి నుండి రామచంద్రాపురం ఆర్డివో కార్యాలయం వరకు ప్లకార్డు పట్టుకుని కాలినడకన పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కోనసీమ జిల్లా కొత్తగా ఏర్పడిందని.. ప్రయాణికులకు సౌకర్యార్థం దూరాభారం తగ్గించేందుకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. పంటు ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపారు అమ్మాజీరావు.