విశాఖలో హవాలా మనీ గుట్టు రట్టు
త్రీటౌన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 75 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.;
విశాఖలో హవాలా మనీ గుట్టు రట్టు చేశారు పోలీసులు. త్రీటౌన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 75 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గాజువాక నుంచి ఓ వ్యక్తి 75 లక్షలు తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డబ్బుకు లెక్క చూపించకపోవడంతో సీజ్ చేశారు. 75 లక్షల డబ్బును ఎక్కడికి, దేని కోసం తీసుకెళ్తున్నాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.