YS Jagan : డ్రగ్స్ కేసు.. వైసీపీ నీతులు.. మహా దారుణం..

Update: 2026-03-16 11:00 GMT

తెలుగు రాజకీయాల్లో మొయినాబాద్ డ్రగ్స్ కేసు తీవ్ర దుమారం రేపుతోంది. ఎవరూ కూడా దాన్ని సహించరు. పోలీసులు వస్తే వారిపై కూడా కాల్పులు జరపడం సహించరాని నేరం. ఈ కేసులో బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రితేష్ రెడ్డి. నిమిద్ కు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ ముగ్గురికి రిమాండ్ విధించింది కోర్టు. అయితే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బ్లడ్ టెస్ట్ రిపోర్టు ఇంకా రాలేదు. కానీ అప్పుడే వైసీపీ రెచ్చిపోతోంది. మహేష్ కుమార్ కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినా ఇంకా సస్పెండ్ చేయట్లేదని గగ్గోలు పెడుతోంది. వాస్తవానికి ఇప్పటికే మహేష్ కుమార్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నోటీసులు కూడా వెళ్లాయి. ఈ కేసులో నిజానిజాలు తేలే వరకు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అదేశించింది.

అలాగే ఈ కేసుపై వివరణ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కానీ వైసీపీ మాత్రం వెంటనే సస్పెండ్ చేయకుండా కావాలనే కాలయాపన చేస్తున్నారని.. డ్రగ్స్ తీసుకున్న వారిని సపోర్ట్ చేస్తున్నారంటూ రకరకాల తప్పుడు ప్రచారం చేస్తోంది. బ్లడ్ టెస్ట్ రిపోర్టు రాకుండానే వాళ్లు చెప్పారు వీళ్లు చెప్పారు పాజిటివ్ వచ్చింది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు వస్తున్నాయో చూస్తున్నాం. వీడియోలో అడ్డంగా దొరికిన మాధవ్ ను, ఆడియో లీకులు అయిన మంత్రులను, లిక్కర్ కేసులో దొరికిన మాజీ మంత్రులను, ఎన్నో మర్డర్ కేసుల్లో దొరికిపోతున్న వారిని కూడా ఇప్పటి వరకు వైసీపీ సస్పెండ్ చేయలేదు.

వైసీపీలో ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కనీసం షోకాజ్ నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్ని తప్పులు చేసినా.. అరెస్ట్ అయినా.. అడ్డంగా సాక్ష్యాలతో అక్రమాలు చేస్తూ దొరికినా సరే జగన్ వారిని వెనకేసుకొస్తారు. కానీ సీఎం చంద్రబాబు తన పార్టీలో ఎవరిమీద అయినా ఆరోపణలు వచ్చినా సరే నోటీసులు ఇస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి సీఎం చంద్రబాబు ఎక్కడ జగన్ ఎక్కడ. ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చే వైసీపీ కూడా నీతులు చెప్పడం మహాదారుణం అంటున్నారు కూటమి నేతలు.

Tags:    

Similar News