Visakhapatnam: విశాఖ జిల్లాలో అమానుషం.. దళిత యువకుడిని చెట్టుకు కట్టేసి..
Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తి మండలం వి.జుత్తాడ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.;
Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తి మండలం వి.జుత్తాడ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక దళిత యువకుడిని మరో దళిత యువకుడు చెట్టుకు కట్టేసిన కొట్టాడు. వి.జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు, సూరిబాబు స్థానిక వైసీపీ నాయకుడి ముఖ్య అనుచరులు.
వారం క్రితం తారకేశ్వరరావు మద్యం మత్తులో వైసీపీ నాయకుడు బిఎన్ రాజును అసభ్య పదజాలంతో దూషించి.. అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడన్న సమాచారం తెలియడంతో.. మరుసటి రోజు సూరిబాబు ఆగ్రహానికి గురై.. తన సెల్‌ఫోన్ దొంగిలించాడన్న నెపంతో తారకేశ్వరరావును చెట్టుకు కట్టేసి బూటు కాలితో తన్నాడు.
అసభ్య పదజాలంతో దూషించాడు. రెండు రోజుల కిందట మళ్లీ వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో.. ఈ వీడియో బయటకొచ్చి విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు.. సెల్‌ఫోన్ దొంగిలించాడనే తారకేశ్వరరావును కొట్టారని.. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.