Anantapur: హిందూపురంలో ఘోర ప్రమాదం.. 40 మంది మహిళలు ఉన్న బస్సు అదుపుతప్పి..
Anantapur: అనంతపురం జిల్లా హిందూపురంలో ఘోర ప్రమాదం తప్పింది.;
Anantapur (tv5news.in)
Anantapur: అనంతపురం జిల్లా హిందూపురంలో ఘోర ప్రమాదం తప్పింది. కోట్నూరు చెరువు ఉధృతి పెరగడంతో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది. వరదలో కొట్టుకు పోతూ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న సైడ్ పిల్లర్లకు తగిలి బస్సు ఆగిపోయింది. బస్సులో దాదాపు 40మంది మహిళలున్నారు. బస్సు అదుపు తప్పడంతో.. అంతా భయంతో పరుగులు తీశారు.
కొట్నూరు గ్రామానికి చెందిన యువకులు వెంటనే స్పందించి మహిళల్ని ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో వెళ్తున్న మహిళలు లేపక్షి మండలం సాడ్లపల్లికి చెందిన వాళ్లు. రోజూలాగే హిందూపురం మండలంలోని తూముకుంటలో పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీళ్లంతా ఓ బట్టల షాపులో పనిచేస్తారని చెబుతున్నారు