AP High Court : హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం
AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాళ్లు నిప్పుపెట్టుకోబోయారు.;
AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాళ్లు నిప్పుపెట్టుకోబోయారు. ఇంతలో ఇది గమనించి అప్రమత్తమైన హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తర్వాత అదుపులోకి తీసుకుని విచారించారు. భార్యాభర్తలది గుంటూరు జిల్లా ధూళిపాళ్ల గ్రామంగా తెలిసింది. ఇంటి విషయంలో వివాదం కారణంగానే వారు సూసైడ్‌యత్నం చేసినట్టు నిర్థారించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరినీ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు.