తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగిన రైతు
కర్నూలు జిల్లా పాములపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగాడు. లింగాల స్వగ్రామానికి చెందిన రైతు సుధాకర్..;
కర్నూలు జిల్లా పాములపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగాడు. లింగాల స్వగ్రామానికి చెందిన రైతు సుధాకర్.. పొలం వేరే వాళ్ల పేరు మీద ఉందంటూ ఫిర్యాదు చేశాడు. కొంతకాలంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆరు నెలల క్రితం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం బహిరంగ విచారణలో ఆ పొలం తనది కాదని నిర్ధారించింది . సమస్య పరిష్కారం కాకపోవడంతో తహశీల్దార్ ఆఫీసు ఎదుట మళ్లీ ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు సుధాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.