చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్‌చల్
చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఉరినాయనపల్లిలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. గత అర్ధరాత్రి గుడ్లనాయనపల్లి, ఉరినాయనపల్లి గ్రామాల పరిసరాల్లోకి ఏనుగుల గుంపు చొరబడింది;
చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఉరినాయనపల్లిలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. గత అర్ధరాత్రి గుడ్లనాయనపల్లి,ఉరినాయనపల్లి గ్రామాల పరిసరాల్లోకి ఏనుగుల గుంపు చొరబడింది. వరి పంటతో పాటు కొబ్బరి తోటలను ఏనుగులు కాళ్లతో తొక్కి నాశనం చేశాయి. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ గ్రామశివార్లోకి వచ్చిన ఏనుగులు నీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకర్లను ధ్వంసం చేశాయి. దీంతో.. అటవీప్రాంతంలోని పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏవైపు నుంచి ఏనుగులు తమపై దాడి చేస్తాయోనని హడలి చస్తున్నారు.