Sri Sathya Sai District : అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడు.. షాకిచ్చిన పోలీసులు

Update: 2025-04-09 09:45 GMT

శ్రీసత్యసాయి జిల్లాలో అక్కాచెల్లెళ్ల(మైనర్లు)తో ఈ నెల 10న పెళ్లికి సిద్ధమైన యువకుడికి పోలీసులు, ICDS అధికారులు షాకిచ్చారు. అతనితోపాటు ఇరు కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాట వినకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో వివాహాన్ని నిలుపుదల చేశారు. ఇద్దరు యువతులతో పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక 3 రోజులుగా సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

మైనర్లను వివాహం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కనుక తమ మాట విని పెళ్లి క్యాన్సల్ చేసుకోవాలని హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కోవడం లాంటివి వినేసరికి ఆందోళనకు గురైన యువకుడి కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వేడుక ఎలా జరుగుతుందో చూద్దామని ఆశించిన వారికి సైతం నిరాశే ఎదురైంది. చట్టాన్ని అతిక్రమించి ఎవరూ తప్పిదాలకు పాల్పడవద్దని, ఎవరికైనా రూల్స్ ఒకటేనని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News