జనసేనలోకి ఆమంచి..త్వరలో పవన్ సమక్షంలో గ్రాండ్ ఎంట్రీ

చీరాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పర్చూరు ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఇవాళ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.;

Update: 2023-07-15 07:45 GMT

చీరాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పర్చూరు ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఇవాళ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. తాను ఎప్పటినుంచో జనసేనలో చేరాలని అనుకుంటున్నట్లు స్వాములు తెలిపారు. సినిమాలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా అభిమానమని తెలిపారు.వేటపాలెం స్ట్రెయిట్ కట్ కాలువ నుంచి తన అనుచరులు, జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. చీరాల, కారంచేడు, పర్చూరు మీదగా మంగళగిరికి చేరుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని తెలిపాడు.ప్రజల మనసును గెలిచిన నాయకుడు మన పవన్ కళ్యాణ్,త్వరలోనే అధికారంలోకి వస్తాం అని తెలిపారు.తమ అభిమాననేత జనసేనలో చేరడంతో చీరాల పర్చూరు నియోజకవర్గాలలో పలువురు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతున్నారు. జిల్లాలో కాపు నాయకుడిగా పేరోందిన ఆమంచి స్వాములు జనసేనలోకి చేరడంతో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ్ముడు వైసీపి అన్న జనసేన కండువాతో ముందుకెళ్లడంతో రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటాయంటున్నారు ప్రజలు. 


Tags:    

Similar News