అడ్డంగా దొరికిపోయిన భూమన కరుణాకర్ రెడ్డి..

Update: 2026-01-08 10:43 GMT

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు, ప్రస్తుత టీటీడీ బోర్డుకు చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న కుట్రలు ఎప్పటికప్పుడు బట్టబయలు అవుతున్నాయి. తాజాగా మరో పని చేసి అడ్డంగా దొరికిపోయారు భూమన. తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్లను ఉద్దేశపూర్వకంగా పడేసి.. ప్రస్తుత టీటీడీ బోర్డుకు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు వైసిపి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేసేందుకు కుట్రకు తెరతీశారు. కానీ నిజం నిప్పులాంటిది కదా అందుకే అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు మొత్తం బయటపడ్డాయి. వైసిపి కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ ఇందులో ఇప్పటికే అరెస్టు అయ్యారు. వైసిపి సోషల్ మీడియా కార్యకర్త నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మద్యం బాటిళ్ల వ్యవహారానికి పాల్పడ్డారు.

ఈ ముగ్గురు వెనక ఉన్నది భూమున కరుణాకర్ రెడ్డి అనేది పోలీసుల విచారణలో తేలిపోయింది. ఈ ముగ్గురు కారులో తిరుపతి నుంచి మద్యం బాటిళ్ల తీసుకువచ్చి ఉద్దేశపూర్వకంగానే గెస్ట్ హౌస్ వద్దపడేసి.. టిటిడి బోర్డుకు మచ్చ తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయం మీద పోలీసులు సీరియస్ గా విచారణ చేసి.. సీసీటీవీ ఫుటేజ్, ఫాస్ట్ ట్యాగ్ వివరాలు, ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా ఆధారంగా వీళ్ళే ఈ పని చేశారని తేల్చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి చెబితేనే ఈ పని చేశారని కూడా విచారణలో స్పష్టం అవుతుంది. భూమన హయాంలో జరిగిన అనేక అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే తట్టుకోలేక ప్రస్తుత టిటిడి బోర్డు మీద కక్షపూరితంగా ఇలాంటి పనులు చేస్తున్నారని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఫైర్ అయ్యారు.

ఇలాంటి పనులకు పాల్పడుతున్న భూమనను ఫస్ట్ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్లాదిమంది విశ్వసించే తిరుమల పవిత్రతను దెబ్బతీయడం అంటే అంతకుమించిన మహాపాపం ఉండదని బిఆర్ నాయుడు గారు సీరియస్ అయ్యారు. తమ హయాంలో తిరుమల పవిత్రతను పెంచి ఆధ్యాత్మికత వెళ్లి వెలిసేలా, భక్తులకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. తమకు మంచి పేరు వస్తుంటే ఓర్వలేక భూమన ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిజమే మరి గతంలో కూడా తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అంటూ తప్పుడు ప్రచారానికి తెరతీసింది కూడా ఇదే భూమన. ఆ తర్వాత లీజు భూముల విషయంలోనూ ఇలాగే చేశారు. అవేవీ వర్కౌట్ కాకపోవడంతో ఇలా తన మనుషులతోనే ఇలాంటి పనులు చేయిస్తున్నారని భక్తులు సీరియస్ అవుతున్నారు.

Tags:    

Similar News