AMARAVATHI:అమరావతి విజన్ రూపకల్పనలో ప్రజలకు అవకాశం

విజన్ 2047 రూపకల్పనపై సీఆర్‌డీఏ కసరత్తు.. ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనల స్వీకరణ.. సుస్థిర రాజధానిగా చేసేందుకు సలహా ఇవ్వాలని వినతి

Update: 2025-11-24 03:30 GMT

అమరావతి విజన్ రూపకల్పనలో సీఆర్డీఏ ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. భవిష్యత్తు తరాలకు ఉత్తమ, సుస్థిరమైన, ఆధునిక మౌలిక వసతులతో కూడిన రాజధాని నగరాన్ని నిర్మించేందుకు అమరావతి విజన్‌ 2047 రూపకల్పనలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను సీఆర్డీఏ స్వీకరిస్తుంది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రా­జ­ధా­ని అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి ది­శ­గా వే­గం­గా అడు­గు­లు పడు­తు­న్నా­యి. అమ­రా­వ­తి రా­జ­ధా­ని ప్రాం­తా­ని­కి ‘వి­జ­న్ 2047’ రూ­ప­క­ల్ప­న­పై సీ­ఆ­ర్‌­డీఏ కస­ర­త్తు మొ­ద­లు­పె­ట్టిం­ది. ఇం­దు­లో భా­గం­గా ఏపీ సి­ఆ­ర్డిఏ ప్ర­జల నుం­చి అభి­ప్రా­యా­లు, సల­హా­లు, సూ­చ­న­లు స్వీ­క­రి­స్తోం­ది. దీని కోసం ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని ప్రాంత అభి­వృ­ద్ధి ప్రా­ధి­కార సం­స్థ(CRDA) ‘వి­జ­న్ 2047’ రూ­ప­క­ల్ప­న­లో భా­గం­గా సర్వే­ను ని­ర్వ­హి­స్తోం­ది. భవి­ష్య­త్తు తరా­ల­కు ఉత్తమ, సు­స్థి­ర­మైన, ఆధు­నిక మౌ­లి­క­వ­స­తు­ల­తో కూ­డిన రా­జ­ధా­ని ప్రాం­తం­గా అమ­రా­వ­తి­ని అభి­వృ­ద్ధి చే­యేం­దు­కు ప్ర­జల అభి­ప్రా­యా­లు, సూ­చ­న­లు సి­ఆ­ర్డి­ఏ­కు ది­శా­ని­ర్దే­శం చే­స్తా­య­ని పే­ర్కొం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని అమ­రా­వ­తి ప్రాం­తం మొ­త్తం­గా 8,600 చద­ర­పు కి­లో­మీ­ట­ర్ల పైగా వి­స్తీ­ర్ణం­లో ఉంది. ఈ ప్రాం­తం­లో కృ­ష్ణా, ఎన్టీ­ఆ­ర్, గుం­టూ­రు, పల్నా­డు, బా­ప­ట్ల, ఏలూ­రు జి­ల్లా­ల­కు చెం­దిన 56 మం­డ­లా­లు, 900కు పైగా గ్రా­మా­ల­తో పాటు వి­జ­య­వాడ, గుం­టూ­రు, అమ­రా­వ­తి, మం­గ­ళ­గి­రి, తా­డే­ప­ల్లి వంటి నగ­రా­లు ఉన్నా­యి.


అమ­రా­వ­తి ‘వి­జ­న్ 2047’ తయా­రీ ప్ర­క్రి­య­లో భా­గం­గా ప్ర­జ­లు, ప్ర­జా­సం­ఘా­లు, ని­పు­ణు­లు, నుం­చి సల­హా­లు, సూ­చ­న­లు, అభి­ప్రా­యా­ల­ను ఏపీ సి­ఆ­ర్డిఏ సే­క­రి­స్తోం­ది. ఈ సర్వే­ను ఇం­గ్లీ­ష్ & తె­లు­గు­లో పూ­ర్తి చే­సు­కు­నే అవ­కా­శం కల్పిం­చిం­ది. ఇక్కడ ఇచ్చిన క్యూ­ఆ­ర్ కో­డ్‌­ను స్కా­న్‌ చే­య­డం ద్వా­రా, కింద ఇచ్చిన లిం­క్ క్లి­క్ చే­య­డం ద్వా­రా లేదా సి­ఆ­ర్డిఏ అధి­కా­రిక వె­బ్‌­సై­ట్ ద్వా­రా సర్వే­లో పా­ల్గొ­ని మీ వి­లు­వైన సల­హా­లు, సూ­చ­న­లు ఇవ్వ­వ­చ్చు. సర్వే­లో అభి­ప్రా­యా­లు, సూ­చ­న­లు, సల­హా­లు పం­ప­డా­ని­కి చి­వ­రి తేదీ 30 నవం­బ­ర్. ఏపీ రా­జ­ధా­ని అమ­రా­వ­తి ప్రాంత అభి­వృ­ద్ధి­ని ప్ర­జల ఆకాం­క్ష­ల­కు అను­గు­ణం­గా తీ­ర్చి­ది­ద్దేం­దు­కు, భవి­ష్య­త్తు తరా­ల­కు అత్యు­త్తమ రా­జ­ధా­ని ప్రాం­తా­న్ని ని­ర్మిం­చేం­దు­కు, ప్ర­జ­లం­ద­రూ ఈ సర్వే­లో పా­ల్గొ­నా­ల­ని ఏపీ సి­ఆ­ర్డిఏ వి­జ్ఞ­ప్తి చే­సిం­ది. మీ అభి­ప్రా­యా­న్ని నమో­దు చే­సేం­దు­కు ఈ లిం­క్‌­ను క్లి­క్ చే­యం­డి లేదా QR కో­డ్‌­ను స్కా­న్ చే­యం­డి:లిం­క్ :  మీ ఆలో­చ­న­ల­తో అద్భు­త­మైన భవి­ష్య­త్తు­ను రూ­పొం­దిం­చ­వ­చ్చు, రా­జ­ధా­ని అమ­రా­వ­తి భవి­ష్య­త్తు వి­జ­న్ రూ­ప­క­ల్ప­న­లో మీరు సైతం భా­గ­స్వా­ము­లు అవ్వా­ల­ని.. ని­ర్ణీత గడు­వు­లో­గా అభి­ప్రా­యా­ల­ను పం­చు­కో­వా­ల­ని ఏపీ సి­ఆ­ర్డిఏ కమి­ష­న­ర్ కా­ర్యా­ల­యం ప్ర­క­టన వి­డు­దల చే­సిం­ది.

Tags:    

Similar News