AMARAVATHI: ఈనెల 19 నుంచి అమరావతిలో ప్రాపర్టీ ఫెస్టివల్
విజయవాడలో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్- 2025.. రాజధాని వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమం.. ఫెస్టివల్ ప్రారంభించనున్న మంత్రి నారాయణ
రాజధాని వైభవాన్ని ప్రతిబింబించేలా అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్- 2025ను నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నారెడ్కో) రాష్ట్ర ఛైర్మన్ గద్దె చక్రధర్ కోరారు. ప్రాపర్టీ ఫెస్టివల్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా ప్రస్తుతం స్థిరాస్తి రంగం పురోగమన దిశలో ఉందన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించే ప్రాపర్టీ ఫెస్టివల్‌కు వచ్చే వినియోగదారులు, అమ్మకందారులకు రాయితీలిస్తున్నట్లు చెప్పారు. సీఆర్డీఏ.. స్టాల్స్ ఏర్పాటు చేస్తుందని, లేఔట్లు, అపార్టుమెంట్ల వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. అమరావతి ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున పెట్టుబడులకు ఇదే అనువైన సమయమని చెప్పారు. సీఆర్డీఏ తరఫున స్టాళ్లు ఏర్పాటు చేసి, లేఅవుట్లు, అపార్టుమెంట్లకు సంబంధించిన నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఇప్పుడే పెట్టుబడులకు అనుకూల సమయమని సూచించారు. విజయవాడలోని లబ్బీపేట ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్‌ను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో 60కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.
అమరావతి నిర్మాణ పనులు వేగవంతం
ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమరావతిలో మొదట జంగిల్ క్లియరెన్స్ చేశారు. అనంతరం భవన నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం కొన్ని నిర్మాణాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం చేసింది. అమరావతిలో ఐకానిక్ టవర్స్ రాష్ట్ర రాజధాని వైభవాన్ని పెంచనున్నాయని మంత్రులు చెబుతున్నారు. అమరావతిని విజయవాడ- హైదరాబాద్ నేషనల్ హైవేతో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై ఓ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనుంది. ఏపీలో అమరావతి రాజధాని పనులు చురుగ్గా సాగుతున్నాయి. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా ఐదేళ్ల పాటు నిలిచిపోయిన పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో భాగంగా రెండో విడతలో భూముల సేకరణ విషయంలో ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మంత్రుల కమిటీకి అప్పగించింది. కమిటీ సిఫార్సు ఆధారంగా త్వరలో దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అయితే తొలి విడతలో ఇంకా భూములివ్వని రైతుల విషయంలోనూ త్వరలో తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.