Maha Padayatra: పాదయాత్రకు పోలీసుల ఆంక్షలు.. ధైర్యంగా ముందుకెళ్లిన మహిళ రైతులు..

Maha Padayatra: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

Update: 2021-12-09 16:26 GMT

Maha Padayatra (tv5news.in)

Maha Padayatra: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. 39వ రోజు సాగిన యాత్రకు చిత్తూరు జిల్లాలోని రైతులు, ప్రజలు, నేతలు మద్దతుగా నిలిచారు. దారిపొడవునా వారికి స్వాగతం పలుకుతూ పసుపు నీళ్లతో రోడ్లు కడిగి స్వాగతం పలికారు. మరికొన్నిచోట్ల గుమ్మడికాయలతో దిష్టితీసి అన్నదాతలకు ఆత్మీయంగా ఆహ్వానించారు.

చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసులు మొదట అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. యాత్రకు ఆంక్షలు పెట్టడం, వారిని ఆపేయడంతో పోలీసుల తీరుపై మహిళలు, రైతులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పరిస్థితిఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, అమరావతి జేఏసీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు దిగొచ్చిన పోలీసులు అమరావతి రైతుల యాత్రకు అనుమతి ఇవ్వడంతో అన్నదాతలు యాత్రను ముందుకు సాగించారు.

శ్రీకాళహస్తిలో పోలీసుల ఆంక్షలపై మండిపడ్డారు అమరావతి పరిరక్షణ సమితి కో కన్వీనర్ రాయపాటి శైలజ. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడి తోనే యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముందుగా బుక్ చేసుకున్న కళ్యాణ మండపాలను కావాలనే క్యాన్సిల్ చేశారని అన్నారు. రాయలసీమ మేధావుల ఫోరం హెచ్చరికలు పట్టించుకోబోమని అన్నారు.

రాజధాని అమరావతి కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ధృడ సంకల్పంతో యాత్రను కొనసాగిస్తున్న అన్నదాతలకు కర్ణాటకలోని ప్రవాసాంధ్ర రైతులు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు అమరావతి రైతులకు 60లక్షల రూపాయల విరాళాలన్ని అందించారు. టీవీ5 ని స్ఫూర్తిగా తీసుకొని రైతులకు విరాళాలను అందించినట్లు వారు పేర్కొన్నారు.

అమరావతిని ఏపి రాజధానిగా ప్రకటించాలనే ధృడ సంకల్పంతో.. అలుపెరుగకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న రైతులకు అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. వారిఅడుగులో అడుగువేస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామని నైతిక ధైర్యం చెపుతూ ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు

Tags:    

Similar News