అమరావతి ఉద్యమంలో ఆగిన మరో గుండె
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడంతో నేటి ఉదయం తీవ్ర మనస్తాపం చెందిన శ్రీను ఉదయం గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.;
అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన కూచిపూడి శ్రీను అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. 30 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాడు. అయితే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంపై ప్రకటన చేసిన దగ్గరి నుంచి అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడంతో నేటి ఉదయం తీవ్ర మనస్తాపం చెందిన శ్రీను ఉదయం గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.