Ambati Rambabu : జగన్ కు షాక్ ఇచ్చిన అంబటి రాంబాబు.. అయ్యో పాపం

Update: 2025-11-11 09:30 GMT

ఏపీలో కూటమి ఏం చేసినా సరే అందులో తప్పులు లేకపోయినా ఏదో ఒకటి చెప్పేసి బురద జల్లడమే వైసీపీ నేతలకు ఉన్న పని. ఇది జగన్ ఆదేశం కూడా. కూటమి ఎంత మంచి పనిచేసినా దాని మీద తప్పుడు ప్రచారాలు చేయాలని ఇప్పటికే జగన్ ఆదేశించారు. అందుకే ఏపీకి వస్తున్న గూగుల్ డేటా సెంటర్ వస్తే అది గో డౌన్ అన్నారు. తుఫాన్ పై జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. కందుకూరు ఘటన, గుంటూరు ఘటన, మెడికల్ కాలేజీల విషయంలో ఎన్నో అబద్దాలు ఆడారు. అలాంటిది ఇప్పుడు అంబటి రాంబాబు జగన్ కు షాక్ ఇచ్చారు. ఆయన తాజాగా తిరుమల దేవస్థానంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో పెట్టారు.

తిరుమలలో అన్న ప్రసాదంపై ప్రశంసల వర్షం కురిపించారు. టీటీడీ బోర్డు భక్తులకు అద్భుతమైన భోజనం పెడుతోందన్నారు. ఇలాంటి భోజనం ఎప్పుడూ తినలేదన్నారు. రోజుకు 90 వేల మందికి బ్రహ్మోత్సవాల టైమ్ లో లక్షా యాభైవేల మందికి పెడుతున్నారని.. భోజనం పెట్టే బిల్డింగు, పరిసరాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఈయన మాటలను బట్టి టీటీడీ పరిపాలన బాగుందనే కదా. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అద్భుతంగా ఇక్కడ పాలన అందిస్తున్నారనే కదా. భక్తులకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని రాంబాబు చెప్పకనే చెప్పారు. ఇప్పటి వరకు వైసీపీ నేతలు టీటీడీ బోర్డు మీద ఎన్నో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు.

కానీ ఇప్పుడు అంబటి రాంబాబు మాటలతో వైసీపీ కుట్రలన్నీ పటాపంచలు అయిపోయాయి. టీటీడీ పనితనం అద్భుతంగా ఉందని స్వయంగా వైసీపీ మాజీ మంత్రి చెప్పారంటే.. ఇక్కడ ఎంత మంచి పనులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పాపం అంబటి రాంబాబు మాటలతో జగన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది కావచ్చు. ఎందుకంటే టీటీడీ మీద ఏదో ఒక తప్పుడు ప్రచారం చేయాలి కానీ.. ఇలా నిజాలు చెప్పేస్తే జగన్ కు నచ్చదు కదా. కానీ ఎంత తప్పుడు మాటలు చెప్పాలని అక్కడకు వెళ్లినా.. అక్కడ జరుగుతున్న పనులను చూసి రాంబాబు మనసు ఒప్పుకోక నిజాలే చెప్పారు. దీన్ని బట్టి టీటీడీ పనితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Full View

Tags:    

Similar News