Amit Shah: మీటింగ్ కోసం తిరుపతికి అమిత్ షా.. ఆలయంలో ప్రత్యేక పూజలు..

Amit Shah: తిరుపతిలో సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ సమావేశానికి సర్వం సిద్ధమైంది.;

Update: 2021-11-14 04:00 GMT

Amit Shah (tv5news.in)

Amit Shah: తిరుపతిలో సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ సమావేశానికి సర్వం సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గోనున్నారు. తాజ్ హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై, సీఎం రంగస్వామి హాజరుకానున్నారు.

నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన అమిత్‌షా మధ్యాహ్నానికి తిరుపతి చేరుకుంటారు. 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. 29వ సమావేశం ఎజెండాలో మొత్తం 26 అంశాల్ని పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితో పాటు 24 కొత్త అంశాలపై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ప్రముఖుల తిరుపతి పర్యటనతో ఎక్కడికక్కడ బందోబస్తు కట్టుదిట్టం చేశారు.

అయితే.. సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ సమావేశం చర్చకు దారితీసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు మాత్రమే తిరుపతికి చేరున్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ సీఎంలు సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. యూపీఏతో భాగస్వామ్యం ఉండటంతో దూరంగా ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. వరికొనుగోలుపై కేంద్రంతో పోరాటం చేస్తుండటంతో సమావేశానికి హాజరు కాకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News