అక్రమ అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని అడ్డుకోలేరు : సీపీఐ రామకృష్ణ
కృష్ణాయపాలెంలో అరెస్టైన రైతుల కుటుంబ సభ్యులును పరామర్శించారు సీపీఐ రామకృష్ణ, ఇతర నేతలు.. అక్రమ అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని అడ్డుకోలేరని ఆ కుటుంబ..;
కృష్ణాయపాలెంలో అరెస్టైన రైతుల కుటుంబ సభ్యులును పరామర్శించారు సీపీఐ రామకృష్ణ, ఇతర నేతలు.. అక్రమ అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని అడ్డుకోలేరని ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపై సీపీఐ నేతలు నిప్పులు చెరిగారు. 317 రోజులుగా మహిళలు, రైతులు న్యాయం కోసం ఉద్యమం చేస్తుంటే.. సీఎం జగన్ ఒక్కసారి అయినా వారితో చర్చించే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు.
అమరావతి ప్రాంతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కనీసం సీఎం దగ్గరకు ఎందుకు వెళ్లలేదని రామకృష్ణ నిలదీశారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలకు భయపడి పోలీసులను అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. సీఎం, మంత్రులు సహా అంతా పోలీసు బలగాలతో బయట తిరుగుతున్నారని, జమ్మూకశ్మీర్‌లో తప్ప ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు.