297వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

Update: 2020-10-09 03:15 GMT

అమరావతి ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒకే రాజధాని కావాలంటూ రైతులు వివిధ రకాలుగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం మొక్కులు చెల్లించేందుకు రైతులు కనకదుర్గ ఆలయానికి పొంగళ్లతో బయలు దేరారు. లింగాయపాలెం గ్రామరైతులు కాలినడకన అమ్మవారిగుడికి వెళుతున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని మొక్కులు చెల్లిస్తామని వారు అంటున్నారు. ఈ ఉదయాన్నే లింగాయపలెం నుండి సీడ్ ఆక్సిస్ రోడ్డపై దుర్గ ఆలయానికి జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ వెళుతున్నారు. 

Tags:    

Similar News