Andhra Pradesh: జగన్ ను నమ్మి నిండా మునిగిపోయాం...
విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల భేటీ ; జగన్ ప్రభుత్వంపై గవర్నర్‌కు 8 ఉద్యోగ సంఘాల నాయకులు ఫిర్యాదు; ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదని ఆరోపణ...;
ఏపీలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చరిత్రలో మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. విజయవాడలోని రాజ్‌భవన్‌కువెళ్లిన 8 ఉద్యోగ సంఘాల నేతలు.. వైసీపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదని.. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నర్‌ను కోరారు.
గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారని... మెరుగైన పీఆర్సీ ఇస్తామని నమ్మించారని... ఆయన మాటలను నమ్మి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కీలకపాత్ర పోషించామని ఉద్యోగులు తెలిపారు. అయితే అధికారంలోకి రాగానే ఉద్యోగులను, ఉపాధ్యాయులను జగన్ నమ్మించి మోసం చేశారని, సకాలంలో తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.