కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ : డీజీపీ

ప్రజలంతా అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.

Update: 2021-05-09 10:00 GMT

ప్రజలంతా అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అత్యవసర ప్రయాణికుల కోసం సోమవారం నుంచి ఇ-పాస్ విధానం అమలు చేస్తామని, దీని కోసం పోలిస్ సేవ యాప్ వినియోగించుకోవాలని సూచించారు. శుభకార్యాలకు అనుమతి తప్పనిసరన్న డీజీపీ.. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. ప్రజలందరూ డబుల్ మాస్కు ధరించాలన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ షరతులు కొనసాగుతాయన్నారు.కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Tags:    

Similar News