Andhra Pradesh: ఏపీలో 5,97,311 మంది రైతులకు రూ.542 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసింది.;
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఆర్థికసాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే వేశారు. 5 లక్షల 97 వేల 311 మంది రైతులకు 542 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించారు.
అలాగే 1 వెయ్యి 220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద 29 కోట్లను బటన్ నొక్కి విడుదల చేశారు. మొత్తం 571 కోట్ల 57 లక్షలు పరిహారం అందించినట్టు సీఎం జగన్ చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు.. పూర్తి పరిహారం సకాలంలో అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం వివరించారు.