AP: సరిహద్దులు దాటిన ఏపీ హస్త కళల వైభవం

లేపాక్షికి ఆర్డర్ ఇచ్చిన సింగపూర్... 400 గిఫ్టు బాక్సుల కోసం ప్రత్యేక ఆర్డర్... గణతంత్ర వేడుకల కోసం గిఫ్ట్ బాక్సులు

Update: 2026-01-24 06:45 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ హస్త­క­ళల వై­భ­వం మరో­సా­రి ప్ర­పంచ స్థా­యి­లో గు­ర్తిం­పు పొం­దిం­ది. రా­ష్ట్రా­ని­కి చెం­దిన సం­ప్ర­దాయ కళా­రూ­పా­లు దేశ సరి­హ­ద్దు­ల­ను దాటి వి­దే­శా­ల్లో­నూ ఆదరణ పొం­దు­తు­న్నా­యి. తా­జా­గా సిం­గ­పూ­ర్‌­లో­ని భారత హై­క­మి­ష­న్ ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వా­ని­కి చెం­దిన లే­పా­క్షి సం­స్థ­కు భారీ ఆర్డ­ర్ ఇవ్వ­డం ఇం­దు­కు ని­ద­ర్శ­నం­గా మా­రిం­ది. ఏకం­గా 400 గి­ఫ్ట్ బా­క్సు­ల­ను లే­పా­క్షి నుం­చి ఆర్డ­ర్ చే­య­డం­తో రా­ష్ట్ర వ్యా­ప్తం­గా కళా­కా­రు­ల్లో, హస్త­క­ళల రం­గం­లో హర్షా­తి­రే­కా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. వి­వ­రా­ల్లో­కి వె­ళ్తే, జన­వ­రి 26న సిం­గ­పూ­ర్‌­లో­ని భారత దౌ­త్య కా­ర్యా­ల­యం­లో గణ­తం­త్ర ది­నో­త్సవ వే­డు­క­లు ఘనం­గా ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి వి­విధ దే­శాల దౌ­త్య­వే­త్త­లు, ప్ర­ము­ఖు­లు, భా­ర­తీయ సమా­జా­ని­కి చెం­దిన ము­ఖ్య ఆహ్వా­ని­తు­లు హా­జ­రు­కా­ను­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా అతి­థు­ల­కు ప్ర­త్యే­కం­గా భా­ర­తీయ సం­స్కృ­తి, సం­ప్ర­దా­యా­ల­ను ప్ర­తి­బిం­బిం­చే బహు­మ­తు­లు అం­దిం­చా­ల­ని భారత హై­క­మి­ష­న్ ని­ర్ణ­యిం­చిం­ది. అం­దు­లో భా­గం­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు చెం­దిన లే­పా­క్షి గి­ఫ్ట్ బా­క్సు­ల­ను ఎం­పిక చే­య­డం వి­శే­షం­గా ని­లి­చిం­ది. గణ­తం­త్ర ది­నో­త్సవ వే­డు­కల కోసం ఎం­పిక చే­సిన ఈ గి­ఫ్ట్ బా­క్సు­ల్లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ హస్త­క­ళల నై­పు­ణ్యం స్ప­ష్టం­గా ప్ర­తి­బిం­బిం­చే కళా­రూ­పా­ల­ను పొం­దు­ప­రి­చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

ము­ఖ్యం­గా సీ­తా­దే­వి లె­ద­ర్ పప్పె­ట్రీ, సం­ప్ర­దాయ శై­లి­లో రూ­పొం­దిం­చిన ఏను­గు ఆకా­ర­పు బ్యా­గే­జ్ ట్యా­గ్, హ్యాం­డ్ పె­యిం­టె­డ్ కో­స్ట­ర్లు వంటి ప్ర­త్యేక వస్తు­వు­లు ఈ గి­ఫ్ట్ బా­క్సు­ల్లో ఉం­డ­ను­న్నా­యి. ఇవ­న్నీ రా­ష్ట్ర కళా­కా­రుల చే­తి­తో తయా­రై­న­వే కా­వ­డం గమ­నా­ర్హం. ఈ కళా­రూ­పా­లు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ సం­ప్ర­దా­యం, సం­స్కృ­తి, కళా వా­ర­స­త్వా­న్ని అం­త­ర్జా­తీయ వే­ది­క­పై చా­టి­చె­ప్ప­ను­న్నా­యి. ఏపీ హస్త­క­ళ­ల­కు ప్ర­పంచ స్థా­యి గు­ర్తిం­పు రా­వ­డం­పై రా­ష్ట్ర చే­నేత, జౌళి శాఖ మం­త్రి సవిత హర్షం వ్య­క్తం చే­శా­రు. ఏపీ హస్త­క­ళల గి­ఫ్ట్ బా­క్స్ అం­ద­జే­యా­ల­ని భా­ర­త్ హై­క­మి­ష­న్ తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­న్ని స్వా­గ­తిం­చా­రు. హస్త­క­ళ­ల­కు ఏపీ­లో­ని కూ­ట­మి ప్ర­భు­త్వం అం­డ­గా ని­లి­చిం­ద­ని మం­త్రి తె­లి­పా­రు. కళా­రూ­పాల తయా­రీ­లో ఆధు­నిక హం­గు­లు అద్దే­లా కళా­కా­రు­ల­కు శి­క్షణ ఇవ్వ­డం జరి­గిం­ద­న్నా­రు. అం­తే­కా­కుం­డా రా­ష్ట్ర వ్యా­ప్తం­గా ఉన్న లే­పా­క్షి షో­రూంల అభి­వృ­ద్ధి­కి ప్ర­త్యేక చర్య­లు తీ­సు­కు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు. వి­శా­ఖ­ప­ట్నం, అనం­త­పు­రం, కడప సహా ప్ర­ధాన కేం­ద్రా­ల్లో­ని 15 షో­రూం­ల­ను ఆధు­నీ­క­రిం­చ­డం జరి­గిం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. త్వ­ర­లో­నే ఇతర దే­శా­ల్లో­నూ లే­పా­క్షి షో­రూంల ఏర్పా­టు­కు ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­ది­స్తు­న్నా­మ­ని ప్ర­క­టిం­చా­రు. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా ఉన్న లే­పా­క్షి షో­రూంల అభి­వృ­ద్ధి­కి ప్ర­త్యేక చర్య­లు తీ­సు­కు­న్నా­మ­ని తె­లి­పా­రు. వి­శా­ఖ­, అనం­త­పు­రం, కడప వంటి ప్ర­ధాన కేం­ద్రా­ల­తో పాటు మొ­త్తం 15 లే­పా­క్షి షో­రూం­ల­ను ఆధు­నీ­క­రిం­చి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు.

సింగపూర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు వచ్చిన ఈ భారీ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ హస్తకళల రంగానికి మైలురాయిగా నిలుస్తోంది. ఇది రాష్ట్ర కళాకారుల శ్రమకు, ప్రతిభకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా భావించవచ్చు. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని అవకాశాలు లభిస్తే, ఆంధ్రప్రదేశ్ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా మరింత వెలుగొందనున్నాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News