Ruia Hospital: రుయా ఆసుపత్రి ఘటన పైన హైకోర్టులో విచారణ
Ruia Hospital: తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన పైన హైకోర్టులో విచారణ జరిగింది. అయితే సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది;
Ruia Hospital: తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన పైన హైకోర్టులో విచారణ జరిగింది. అయితే సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతులకు కోటి పరిహారం ఇచ్చినట్లు గానే రుయా మృతులకు కోటి రూపాయల పరిహారం అందించాలని పిటిషనర్ కోరారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో వెంటనే ఐదు ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని అన్నారు. రుయా ఆసుపత్రి ఘటన పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. పిటిషనర్ పి ఆర్ మోహన్... ఆస్పత్రి తప్పిదమని స్వయానా కలెక్టర్ చెప్పిన రుయా ఆసుపత్రి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజల బాలాజీ. వెకేషన్ బెంచ్ తరవాత రోజుకు విచారణ వాయిదా వేసింది.