ఏపీ వ్యాప్తంగా రెండో విడత అన్నా క్యాంటీన్ల ప్రారంభమయ్యాయి. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు... నేడు రెండో విడతలో మరో 75 క్యాంటీన్లను ఓపెన్ చేశారు. మొత్తంగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా... తొలిదశలో భాగంగా 100 క్యాంటీన్లను ప్రభుత్వం ఇదివరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ క్యాంటీన్లలో 15 రూపాయలకే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో 2018లో చంద్రబాబు ప్రభుత్వం అన్నాక్యాంటీన్ల పేరుతో ఏర్పాటు చేసింది.