Andhra Pradesh : అదనపు రుణం పొందే అర్హతను కోల్పోయిన ఏపీ..!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ అదనపు రుణం పొందే అర్హతను కోల్పోయింది. మూలధన వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకపడడంతో.. ఏపీ అదనపు రుణాన్ని పొందలేకపోయింది.;

Update: 2021-11-12 15:16 GMT

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ అదనపు రుణం పొందే అర్హతను కోల్పోయింది. మూలధన వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకపడడంతో.. ఏపీ అదనపు రుణాన్ని పొందలేకపోయింది. రెండో త్రైమాసికంలో మూలధన వ్యయం లక్షాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు.. FRBMకు అదనంగా 16 వేల 691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. తెలంగాణకు 5 వేల 392 కోట్ల అదనపు రుణం పొందేందుకు అనుమతి ఇచ్చింది. అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి.

Tags:    

Similar News