AP New Cabinet: ఏపీ క్యాబినెట్‌లోకి వచ్చేదెవరు? వెళ్లేదెవరు?..

AP New Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణ హాట్‌ టాపిక్‌గా మారింది. కేబినెట్‌లో ఎవరుంటారు.. ఎవరూడుతారు...?;

Update: 2022-03-15 11:56 GMT

AP New Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణ హాట్‌ టాపిక్‌గా మారింది. కేబినెట్‌లో ఎవరుంటారు.. ఎవరూడుతారు...? అనేది ఉత్కంఠగా మారింది. మంత్రివర్గ విస్తరణ ఉంటే.. ఏప్రిల్‌లో ఉంటుందా?. లేక జూన్‌లోనా?. ఇలా కేబినెట్ విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణలో మార్పులు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. మంత్రుల్లో అందరినీ మార్చేస్తారా? లేక కొందరిని కొనసాగిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

ప్రస్తుత మంత్రుల్లో కొందరిని కొనసాగిస్తారనే ప్రచారం ఐతే జరుగుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నానిలను కొనసాగిస్తారని తెలుస్తోంది. అటు బుగ్గన, బాలినేనిల్లో ఒక్కరికే ఛాన్స్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇక బొత్సను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని విస్తృత ప్రచారం నడుస్తోంది. విజయసాయిరెడ్డికి పార్టీ కేంద్రకార్యాలయ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. పదవులు కోల్పోయిన మంత్రులను ఈనెల 27న సీఎం జగన్ రాజీనామా కోరుతారని సమాచారం.

ఇక తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మంత్రి పదవులు వరిస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రివర్గ విస్తరణ అయిన వెంటనే సీఎం జగన్‌ ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తోంది. జిల్లాల పర్యటన చేపట్టి ముందస్తు ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ ఉగాదికి ఉంటే జూన్ నుంచి సీఎం జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ విస్తరణ జూన్‌లోకి మారితే జులై, ఆగస్ట్ నెలల్లో సీఎం జిల్లాల పర్యటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అటు డిసెంబరు కల్లా అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్లో మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని వ్యూహాకర్తల సర్వేల్లో తేలిందా?. అసంతృప్తి పతాకస్ధాయికి చేరకుండానే ఎన్నికలకు వెళ్లాలని జగన్ నిర్ణయించారా? ఇలా అనేక ప్రశ్నలు జనాల మెదడును తొలిచేస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ మంత్రివర్గ విస్తరణ కీలకంగా మారింది.

Tags:    

Similar News