Andhra Pradesh: సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కడంతో దిగివచ్చిన ప్రభుత్వం..

Andhra Pradesh: CPS రద్దు చేయాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం దిగివచ్చింది.

Update: 2022-04-26 01:49 GMT

Andhra Pradesh: CPS రద్దు చేయాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సీపీఎస్‌ అంశంపై చర్చించేందుకు సోమవారం రాత్రి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో చర్చలు జరిగాయి. సమావేశంలో ఆర్థికమంత్రి బుగ్గన, ఉన్నతాధికారులు, రెవిన్యూ సర్విసెస్‌ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదన ఉద్యోగ సంఘాల ముందు పెట్టింది.

ఉద్యోగులు సీరపీఎస్ రద్దు చేయాలని పట్టుబడుతున్న వేళ..గ్యారంటీ పింఛను స్కీం-GPS పథకం అమలు చేస్తామని ప్రతిపాదన తెచ్చింది. ఐతే ఉద్యోగులు మాత్రం సీపీఎస్‌ రద్దు పైనే పట్టుబట్టారు. అదికాకుండా ఇతర ప్రత్యామ్నాయాలు అంగీకరించేది లేదన్నారు. పాత పింఛను విధానమే కావాలని కోరినట్లు చెప్పారు. CPSకు, GPSకు మధ్య తేడాను ప్రభుత్వం చెప్పలేకోపోయిందన్నారు. ఉద్యోగి చనిపోతే ఖర్చులు ఇవ్వాలన్న దానిపై జీవో కోరామన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.

Tags:    

Similar News