Chandrababu Naidu : సంపద సృష్టికి ఏపీ స్వర్గదామం.. చంద్రబాబు సూపర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గదామంగా మారుతోంది. భౌగోళికంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఏపీకి ఉన్న ప్రత్యేకతను సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా వినియోగిస్తున్నారు. “సంపద సృష్టే లక్ష్యం”గా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి ఉన్న ప్రధాన అడ్వాంటేజ్.. దీర్ఘమైన సముద్ర తీర రేఖ. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు సముద్ర మార్గం అందుబాటులో ఉండటం పెట్టుబడిదారులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. పోర్టులు, షిప్పింగ్, ఎగుమతులు–దిగుమతుల విషయంలో రవాణా చాలా ఈజీగా ఉండటంతో పరిశ్రమల స్థాపనకు ఏపీ అత్యంత అనుకూలంగా ఉంది. ఏపీలో పెట్టుబడులు పెడితే రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి. సముద్ర మార్గం ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను తరలించడం సులభమవుతుంది.
ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు ప్రధానంగా వివరిస్తూ.. ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. పెట్టుబడుల కోసం భూముల లభ్యత అనేది చాలా కీలకం. ఈ విషయంలో కూడా ఏపీ ముందుంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండటంతో పరిశ్రమల కోసం భూముల కేటాయింపు సులభంగా జరుగుతోంది. భూ సేకరణ సమస్యలు తక్కువగా ఉండటం వల్ల ప్రాజెక్టులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. భూములు మాత్రమే కాదు.. వాతావరణం కూడా పెట్టుబడులకు అనుకూలంగా ఉండటం ఏపీకి ఉన్న మరో బలం. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, విద్యుత్, నీరు, మానవ వనరులు అందుబాటులో ఉండటంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ అవకాశాలను గమనించిన సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. పెట్టుబడులు భూమిపైకి రావాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎంవోయూలు కుదిరిన వెంటనే శంకుస్థాపనలు, పనుల ప్రారంభం జరగడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. ఏపీకి ఉన్న సహజ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చూపిస్తున్న స్పష్టమైన విజన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పెట్టుబడులు పెరుగుతున్న తీరు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు చూస్తుంటే “ఆయన ప్లాన్ అదుర్స్” అంటూ ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు.