AP: ఐఐసీ మద్రాస్‌తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందాలు

అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంపై లక్ష్యం... నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాల్లో ఒప్పందం;

Update: 2024-11-16 03:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పురోగామి దిశగా తీసుకు వెళ్లేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో శుక్రవారం మద్రాస్ ఐఐటీతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం, అధునాతన సాంకేతికత, పరిశోధన ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై మద్రాస్ ఐఐటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాలు ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ప్రభుత్వంతో కలిసి ఐఐటీ మద్రాస్ పనిచేయనుంది.

టీచర్లపై కేసులు ఎత్తేస్తాం

ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. టీచర్లపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసినపుడు ఉపాధ్యాయులపై దొంగకేసులు పెట్టారని, డీజీపీతో మాట్లాడి ఆ కేసులన్నీ తొలగిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం, పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం చంద్రబాబు వద్ద ఉందన్నారు.

వెనక్కి వచ్చిన దిగ్గజ సంస్థలు

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన లులు లాంటి సంస్థలు సైతం మళ్లీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అలాగే రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన పనులు సైతం వేగవంతమయ్యాయి. టాటా సంస్థ సైతం ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అదే విధంగా పలు ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నంతోపాటు పలు నగరాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై పెట్టులేదు. దీంతో రాష్ట్రంలోని యువత..ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయింది. అలాగే వివిధ పరిశ్రమలు సైతం రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్లుగా.. కూటమికి తన ఓటు ద్వారా మద్దతు ప్రకటించాడు.

Tags:    

Similar News