AP: అగస్ట్ 15 నుంచి అన్న క్యాంటీన్లు
తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని లక్ష్యం... టెండర్లు పిలిచి పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం;
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. అన్న క్యాంటీన్ల పున: ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి.. ఆరోజు కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది.. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించిన టెండర్లు పిలిచి పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను రూ.20 కోట్లతో మరమ్మతులు చేస్తున్నారు. అలాగే క్యాంటీన్లలో ఐవోటీ డివైజ్‌ల ఏర్పాటు చేయడంతో పాటుగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కోసం రూ.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ.65 కోట్లను కూడా విడుదల చేశారు.
తొలిదశలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని తెలుగు దేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే టెండర్లు పిలిచారు అధికారులు. ఈనెల 22 వరకు టెండర్లకు గడువు ఉంది. దీంతో... నెలాఖరులోగా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలకు సంబంధించిన టెండర్లను ఖరారు చేయనుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు... గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. అందుకోసం 20 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఐవోటీ డివైజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కోసం 7 కోట్ల రూపాయలు కేటాయించింది టీడీపీ ప్రభుత్వం. మరో 20 అన్న క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం 65 కోట్లు విడుదల చేయనుంది.
అన్న క్యాంటీన్ల నిర్వహరణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తోంది. ఇందు కోసం అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేకంగా వెబ్‌సైట్ తయారుచేయబోతున్నారు. దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అన్న క్యాంటీన్ల పూర్తి భావం ప్రభుత్వంపై పడకుండా... సరికొత్త ఆలోచన చేస్తున్నారు. దాతల సాయంతో అన్నా క్యాంటీన్లు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. విరాళాల సేకరణ కూడా మొదలుపెట్టారు. అంతేకాదు... మరో కొత్త ఆలోచన చేశారు సీఎం చంద్రబాబు. పుట్టినరోజు జరుపుకునే వారు ఎవరైనా సరే... అన్న క్యాంటిన్ ద్వారా పేదలకు భోజనం అందిచొచ్చని చెప్పారు.