TTD : పొలిటికల్ లీడర్ల నుంచి హీరోయిన్ల దాకా.. టీటీడీ పరిపాలనపై ప్రశంసలు.
టీటీడీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కూటమి ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో మార్పులు చేపట్టారు. సామాన్య ప్రజలకు పెద్ద పీట వేశారు. అన్నదానం దగ్గరి నుంచి ప్రసాదం దాకా అత్యంత నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూస్తున్నారు. భక్తులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల వెళ్తున్న ప్రతి ఒక్కరూ అక్కడి ఏర్పాట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయ నేతల దగ్గరి నుంచి సినిమా సెలబ్రిటీల దాకా తిరుమలలో ఏర్పాట్లపై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య ప్రతిపక్ష నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తిరుమల ఏర్పాట్లపై ప్రశంసించిన సంగతి చూశాం.
ఇప్పుడు హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా టీటీడీని ప్రశంసల్లో ముంచెత్తింది. అక్కడి ఏర్పాట్లు చూశాక తన మనసు పులకించిపోయిందని.. ఇలాంటి ఏర్పాట్లు చూశాక కచ్చితంగా టీటీడీని ప్రశంసించాలి అనిపిస్తోందంటూ ఆమె చెప్పారు. నిజమే మరి బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యాక.. పరిశుభ్రతకు, రవాణా సౌకర్యాలకు, సత్వర చర్యలకు నడుం బిగించారు. అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ సామాన్యులకే పెద్ద పీట వేస్తున్నారు. అన్న దానం నుంచి లడ్డూ ప్రసాదం దాకా.. అత్యంత నాణ్యతతో తయారు చేయిస్తున్నారు.
భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్లీ టీటీడీపై పెంచుతున్నారు. గత వైసీపీ పాలనలో తిరుమలను నిర్లక్ష్యం చేశారు. ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా భక్తులను ఇబ్బంది పెట్టారు. చివరకు లడ్డూలో నెయ్యిని కల్తీ చేసి పాపం మూటగట్టుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి హయాంలో మాత్రం సకల సౌకర్యాలతో, పరిశుభ్రత, నాణ్యతతో టీటీడీ భక్తులకు మంచి సేవలు అందిస్తోంది. ఇంత చేస్తున్నారు కాబట్టే టీటీడీ బోర్డు మీద సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రశంసలు కురిపిస్తున్నారు.