AP : "ఎమ్మెల్యేగా పులివర్తి నానిని గెలిపించుకుంటాం"

Update: 2023-04-09 12:23 GMT

తమ ఎమ్మెల్యేగా పులివర్తి నానిని గెలిపించుకుంటామన్నారు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. చంద్రగిరి సీటును గెలిచి చంద్ర బాబుకు బహుమతిగా ఇస్తామంటున్నారు. తిరుపతి లోని రామానాయుడు కళ్యాణ మండపంలో చంద్రగిరి నియెజకవర్గ సర్వసభ్య సమావేశం జరి గింది. ఈ సమావేశానికి పలు మండలాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇకపై ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కాకుండా రానున్న ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పనిచేయాలని బీదా రవిచంద్ర కార్యకర్తలకు సూచించారు. తన గెలుపునకు, పార్టీ కోసం కష్టపడే ప్రతీ ఒక్కరు ఎమ్మెల్యే అని చెప్పారు చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని.

Similar News