Adulterated Liquor Scam : కల్తీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. అంతా చెప్పేశారా..?
ఏపీ రాజకీయాలను కుదిపేసిన అతిపెద్ద కేసు కల్తీ లిక్కర్. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి వైసిపి నాయకులు సాగించిన అరాచక కాండ ఇది. కానీ పాపం పండడానికి ఎన్నో రోజులు పట్టదు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ లిక్కర్ కేసును బయటకు తీసి ఇందులో ఉన్న అరాచక శక్తులను లోపల వేయటం ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే జోగి బ్రదర్స్, అద్దేపల్లి జనార్దన్ రావు, కసిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇందులో కీలకంగా వ్యవహరించిన అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు.
అయితే ఈ కేసులో ఏపీ బీసీఎల్ ఎండి వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్ అప్రూవల్ గా మారినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరూ వైసీపీ హయాంలో ఏపీ కల్తీ లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులుగా పేరు ఉంది. వీళ్లు నోరు విప్పితే అసలు నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోటే ఇన్ని రోజులు వైసిపి నేతలు వీరిద్దరిని ఒత్తిడి చేసినట్లు సమాచారం. కానీ ఇప్పుడు సిట్ విచారణలో వీరిద్దరూ అప్రూవల్ గా మారిపోయి అసలు నిజాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో బిగ్ బాస్ ఎవరు, అంతిమ లబ్ధిదారు ఎవరు, ఎవరి సపోర్టుతో ఈ కల్తీ లిక్కర్ దందా నిర్వహించారు అనేది బయట పెట్టారంట.
ఎవరు చెబితే ఈ కల్తీ మాఫియా నుంచి వచ్చిన డబ్బులను ఆన్లైన్ ద్వారా కాకుండా క్యాష్ రూపంలోనే చెల్లింపులు చేశారు అనేది కూడా తెలిపినట్టు సమాచారం. వీరిద్దరూ చెప్పిన కీలక విషయాలను బట్టి సిట్ లోతుగా విచారణ సాగిస్తోంది. అతి త్వరలోనే ఈ కేసులో అంతిమ లబ్ధిదారును బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ కల్తీ లిక్కర్ దందాలో అతిపెద్ద నేత ఇప్పుడు టెన్షన్ పడుతున్నట్లు వైసిపిలో టాక్ నడుస్తోంది. ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగిన వారందరూ కూడా ఇప్పుడు ఈ కేసుతో టెన్షన్ లో పడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని అధికారులు కూడా చెబుతున్నారు. అందుకే సిట్ ఈ కేసులో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ నిజానిజాలను తేల్చే పనిలో పడింది. మరి అంతిమ లబ్ధిదారు ఎవరనేది సిట్ ఎప్పుడు బయట పెడుతుందో చూద్దాం.