Nara Lokesh : లోకేష్‌ సేవాభావం.. పునర్వికకు ప్రాణం పోసిన మంత్రి.

Update: 2026-02-27 05:45 GMT

మంత్రి నారా లోకేష్ మొదటి నుంచి ఎంతటి సేవా భావంతో ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా సరే తన సేవలు ఆపట్లేదు. ట్విట్టర్ లో ఎవరు ఎలాంటి సాయం కావాలని అడిగినా సరే వెంటనే స్పందిస్తున్నారు. ప్రత్యేకంగా తన దగ్గరకు వచ్చి కలిస్తేనే స్పందించే నేతను తాను కాదు అని ఎప్పటికప్పుడు నిరూపించుకున్నారు. ఇప్పటికే వేలాది మందికి సాయం చేస్తున్న లోకేష్.. తాజాగా పునర్వికకు కూడా అతిపెద్ద సాయం అందించారు. కడప జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ చేస్తేనే బతుకుతుంది. అందుకే ఇప్పటికే అనేక మంది కలిసి రూ.10 కోట్ల దాకా కలెక్ట్ చేశారు. మిగిలిన ఆరు కోట్లు కావాలని పేరెంట్స్ లోకేష్ ను ఎక్స్ వేదికగా అడగిన వెంటనే స్పందించారు. రూ.6 కోట్లు అందించే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. అందరం కలిసి పునర్వికను కాపాడుకుందాం అని చెప్పారు.

దీంతో మంత్రి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ రోజుల్లో చిన్న సాయం చేసి పదింతలు చెప్పుకునే నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ లోకేష్ మాత్రం తాను అలా చెప్పుకునే నేతను కాదని నిరూపించుకుంటున్నారు. ఎంత మందికి ఎన్ని రకాలుగా సాయం చేసినా సరే.. తాను మాత్రం సింపుల్ గానే ఉండిపోతానని చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పునర్వికకు ఇంత పెద్ద సాయం చేసినా సరే ఎక్కడా ఆర్భాటాలకు పోవట్లేదు. కేవలం తాను ఒక సమాజ సేవకుడిని అన్నట్టుగానే ఆయన ఉండిపోతున్నారు.

ఇప్పుడు పునర్వికకు మాత్రమే కాదు.. ఎంతో మంది చిన్నారులకు మంత్రి సాయం అందిస్తున్నారు. కాకపోతే అవన్నీ ఆయన బయటకు చెప్పుకోవట్లేదు. తన వద్దకు సాయం కోసం ప్రత్యేకంగా రావాల్సిన పనిలేదు. కేవలం ఎక్స్ లో ఒక ట్వీట్ చేసినా సరే రెస్పాన్స్ అవుతున్నారు. ఇందుకోసం లోకేష్ టీమ్ ఎప్పటికప్పుడు సహాయం అందించడానికి రెడీగానే ఉంటుంది.

Tags:    

Similar News