Sunil Naik : సునీల్ నాయక్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలు తప్పవు..!

Update: 2026-02-27 06:00 GMT

జగన్ సీఎంగా ఉన్నప్పుడు అధికారులను తన అవసరాల కోసం ఒత్తిడి చేసి వాడేసుకున్నారు జగన్. అధికారులతో అక్రమ కేసులను టీడీపీ నేతల మీద పెట్టించారు. తనను ఎవరు ప్రశ్నిస్తే వారిని టార్చర్ చేయించారు. జగన్ ప్రలోభాలకు, ఒత్తిడులకు చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తలొగ్గారు. జగన్ మెప్పు కోసం, ప్రమోషన్ల కోసం, ఇంకొంత మంది బిజినెస్ ల కోసం రకరకాల చట్ట వ్యతిరేక పనులు చేశారు. అందులో సునీల్ నాయక్ కూడా ఉన్నారు. ఆయన గతంలో రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి పాట్నాకు మొన్న ఏపీ పోలీసులు వెళ్తే పెద్ద హంగామా జరిగింది. ఆయనకు అక్కడి కోర్టు అరెస్ట్ చేయకుండా ఆర్డర్లు ఇవ్వలేదు. ఈ లోగా ఏపీ స్థానిక కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది.

ఈ దెబ్బతో సునీల్ నాయక్ అరెస్ట్ తప్పదు అనే సంకేతాలు వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో సునీల్ నాయకు అసలు బయటకు రావట్లేదు. ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఆయన కోసం ఏపీ పోలీసులు విస్తృతంగా గాలించేందుకు రెడీ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సునీల్ నాయకు ను అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు చూస్తున్నారు. ఎన్నో అక్రమ కేసుల్లో సునీల్ నాయక్ పేరు గతంలోనూ వినిపించింది. మొదటి నుంచి వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా ఆయన మీద ముద్ర పడిపోయింది.

ఇంకోవైపు జగన్ అండ్ బ్యాచ్ ను సునీల్ నాయక్ సంప్రదించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆనాడు తనతో అలాంటి పనులు చేయించి.. ఇప్పుడు తాను చిక్కుల్లో పడితే కనీసం పట్టించుకోరా అంటూ జగన్ అండ్ బ్యాచ్ మీద సునీల్ నాయకు మండిపడుతున్నారంట. వారితో చర్చించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. అయినా సరే వైసీపీ అండ్ జగన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంట. మరి సునీల్ నాయకు ఏ క్షణంలో అరెస్ట్ అవుతారా అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News