AP: పటిష్టంగా ఉచిత విద్యుత్ అమలు
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం... ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్;
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇంధనశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. దెబ్బతిన్న పాతలైన్లు, పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాలకు 100 శాతం విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కాని గిరిజన ఆవాసాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు.
విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని డిస్కంలను ఆదేశించారు. లోడ్ సమస్యలు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ స్థంబాలు, లూజుగా ఉన్న లైన్లు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.. గిరిజన ప్రాంతాల్లో 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి చేయాలన్నారు.
విద్యుత్ లైన్లు వేయలేని గిరిజన ప్రాంతాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు మంత్రి గొట్టిపాటికి వివరించారు అధికారులు.. 2-3 నెలల్లో కొత్తగా 13 సబ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్. ఇక, ముఫ్త్ బిజిలి యోజన కింద రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఫలకాల ఏర్పాటును ముమ్మరం చేస్తున్నామని వెల్లడించారు.. ఏదేమైనా.. వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని.. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వినియోగదారులకు మేలైన విద్యుత్తును అందించేందుకు ఇంధన సంస్థలు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని... గిరిజన గ్రామాల్లో 100 శాతం కరెంటు సరఫరా చేసేలా కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. వేలాడుతున్న విద్యుత్తు స్తంభాలు, వైర్లు లేకుండా నిరంతరం డిస్కమ్‌లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు .
కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ కరెంట్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దస్త్రంపై మూడో సంతకం చేసినట్లు గొట్టిపాటి చెప్పారు.