Ap: బాపట్ల క్వారీ దుర్ఘటన...ఆరుగురు కార్మికులు మృతి

Update: 2025-08-03 14:45 GMT

బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్‌ క్వారీలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్లు విరిగి పడటంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. అప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది, మిగిలిన ఇద్దరిని రాళ్ల మధ్య నుంచి బయటకు తీయేందుకు యత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది పనిచేస్తుండగా, తీవ్రంగా గాయపడిన 10 మందిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించగా, ప్రమాదానికి భద్రతా లోపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News