విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఫైట్ చేస్తాం : సోము వీర్రాజు
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.;
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఏపీ చరిత్రలోనే పెద్ద ఉద్యమం అని చెప్పారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎమ్మెల్సీ మాధవ్ కలిశారని.. జీవీఎల్ నరసింహారావు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. 14న ఢిల్లీలో సమావేశం జరుగుతుందని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మరోసారి ఆలోచించాలని కేంద్ర మంత్రులను కలిసి కోరతామని సోము వీర్రాజు చెప్పారు.