AP CM : ఏపీ కేబినెట్ భేటీ.. దివాళీ శుభవార్తలు చెప్పనున్న సీఎం

Update: 2024-10-23 08:45 GMT

ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఇందులో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు, వాటి అమలకు తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధానంగా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ కేబినెట్ ఆమోదించనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు , పథకానికి అర్హుల ఎంపిక , ఆర్థిక భారం వంటి అంశాలపై చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చెత్త పన్ను రద్దు పైన ఇప్పటికే చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మున్సిపాలిటీల్లో కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదన పై కూడా మంత్రివర్గం చర్చలు జరపనుంది. 

Tags:    

Similar News