AP Cabinet: రాజ్‌భవన్‌కు చేరిన మంత్రుల రాజీనామా లేఖల ఫైల్..
AP Cabinet: ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు చర్యలు వేగవంతం అయ్యాయి.;
AP Cabinet: ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే మంత్రుల రాజీనామాలను స్వీకరించిన సీఎం జగన్... వాటిని గవర్నర్‌కు పంపారు. మంత్రుల రాజీనామా లేఖల ఫైల్ రాజ్‌భవన్‌కు చేరింది. ఇవాళ గవర్నర్... మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. మంత్రి పదవులు ఖాళీ అయినట్లు ఇవాళ గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖలు కొత్త మంత్రివర్గం ఏర్పడేవరకు సీఎం జగన్ వద్దే ఉంటాయి.
మరోవైపు జగన్ తీరుపై మాజీ మంత్రుల్లో అసంతృప్తి పెట్టుబుకుతోంది. తమచేత మూకుమ్మడి రాజీనామాలు చేయించడాన్ని తాజా మాజీలు అవమానంగా భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో తలెత్తుకోలేమనే భావనలో పలువురు మాజీ మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల నుంచి తప్పించిన వారిని సంతృప్తి పరిచేలా ప్రాంతీయ మండళ్ల కేబినెట్ హోదా తాయిలం ఎరవేస్తున్నారు జగన్. కేబినెట్ హోదాకు, కేబినెట్‌లో ఉండటానికి చాలా తేడా ఉంటుందని వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
తాజా మాజీ మంత్రుల తీరును నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. కొందరికి అవకాశం ఉంటుందని ఊరిస్తున్నారు. ఆ జాబితాలో తమపేరు ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ మాజీ మంత్రుల్లో నెలకొంది. ప్రస్తుతానికి గోప్యంగానే కొత్త మంత్రి వర్గ కూర్పు జగన్ కానిస్తున్నారు. ఎల్లుండి వరకు కొత్త మంత్రి వర్గ కూర్పుపై సస్పెన్స్ కొనసాగించనున్నారు. పరిణామాలను నిశితంగా గమనించిన పిదప కొత్త మంత్రి వర్గ కూర్పు వెల్లడించే అవకాశం ఉంది.