ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను మరో 4 నెలల పాటు పొడిగించారు. 2025 ఆగస్టు 28 వరకు సస్పెన్షన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన అభియోగంపై సునీల్‌కుమార్‌పై వేటు పడింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
వైసీపీ హయాంలో సీఐడీ విభాగాధిపతిగా పనిచేసి వివాదాస్పదుడిగా సునీల్‌కుమార్ ముద్రపడ్డారు.. జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశాల్లో పర్యటించినట్లు గుర్తించారు. ఒకటి, రెండు సందర్భాల్లో అనుమతి పొందినా, ఆ దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. 2019 డిసెంబరు నుంచి 2024 మార్చి మధ్య మొత్తం ఆరుసార్లు పీవీ సునీల్‌కుమార్ ఇలా విదేశాల్లో పర్యటించినట్లు కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ సీఎస్ కె.విజయానంద్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా సస్పెన్షన్‌ను పొడిగించారు.