CBN: ఏపీలో నేరస్థులకు చోటు లేదు

శాంతి భద్రతలకే అధిక ప్రాధాన్యం... తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక... ఏఐ హ్యాకథాన్‌, టూరిజం సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు;

Update: 2025-06-28 03:00 GMT

ఎన్నో అనా­రో­గ్య సమ­స్య­ల­కు యోగా పరి­ష్కా­ర­మ­ని, యోగా ని­త్య జీ­వి­తం­లో భాగం కా­వా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. యో­గా­ను దే­శం­లో ప్ర­ధా­ని మోదీ ప్ర­మో­ట్ చే­స్తు­న్నా­ర­ని అన్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ భవి­ష్య­త్తు­లో వె­ల్నె­స్‌­కి చి­రు­నా­మా అవు­తుం­ద­ని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. అం­ద­రి­కి యోగ అం­దిం­చా­ల­నే లక్ష్యం­గా పని చే­స్తు­న్నాం. రామ్ దేవ్ బా­బా­ను ఏపీ­కి టూ­రి­జం సల­హా­దా­రు­గా ఉం­డా­ల­ని కో­రు­తు­న్నా­న­ని అన్నా­రు. పర్యా­టక రం­గా­న్ని పరు­గు­లు పె­ట్టిం­చా­ల­ని కూ­ట­మి ప్ర­భు­త్వం కం­క­ణం కట్టు­కుం­ది. ఇం­దు­లో భా­గం­గా­నే వి­జ­య­వా­డ­లో రెం­డ్రో­జుల టూ­రి­జం కాం­క్లే­వ్ ని­ర్వ­హిం­చా­రు. దీ­ని­కి సీఎం చం­ద్ర­బా­బు­తో పాటు ప్ర­ముఖ యోగా గు­రు­వు, పతాం­జ­లి సం­స్థ యజ­మా­ని బాబా రాం­దే­వ్ చీఫ్ గె­స్ట్‌­గా హా­జ­ర­య్యా­రు.

 కమ్యూనిజం కాదు టూరిజం

కమ్యూ­ని­జం.. సో­ష­లి­జం.. క్యా­ప్టి­లి­జం.. అన్ని ఇజా­లు పో­యా­య­ని.. టూ­రి­జం ఒక్క­టే మి­గి­లిం­ద­ని తాను ఎప్పు­డో చె­ప్పా­న­ని చం­ద్ర­బా­బు గు­ర్తు చే­శా­రు. తాను గతం­లో టె­క్న­లా­జి­ని ప్ర­మో­ట్ చే­శా­న­ని... గతం­లో బిల్ గే­ట్స్ తో సమా­వే­శం తర్వాత హై­ద­రా­బా­ద్ లో సెం­ట­ర్ ఏర్పా­టు చే­శా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. " ప్ర­స్తు­తం వా­ట్సా­ప్ లో 700 కు పైగా సే­వ­లు అం­దు­బా­టు­లో ఉన్నా­యి. టూ­రి­జం ఒక్క­టే ఉద్యో­గా­లు ఇవ్వ­గ­ల­దు. ప్ర­కృ­తి ఆహా­రం, యో­గ­తో సం­పూ­ర్ణ ఆరో­గ్యం­తో ఉం­టా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ లో తి­రు­ప­తి, శ్రీ­శై­లం తో పాటు అనేక పు­ణ్య క్షే­త్రా­లు ఉన్నా­యి. కొ­న­సీమ, రా­జ­మం­డ్రి గో­దా­వ­రి, మద­న­ప­ల్లి హా­ర్స్ లీ హి­ల్స్ వంటి ప్ర­దే­శా­లు ఉన్నా­యి: అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

 బ్రాడ్ అంబాసిడర్‌గా రామ్‌దేవ్‌..!

ఆగ­స్టు 15 లోగా అన్ని సే­వ­ల­ను ఆన్‌­లై­న్‌­లో అం­ది­స్తా­మ­ని తె­లి­పా­రు. ఆధ్యా­త్మి­క­వే­త్త­గా ఉన్న బాబా రా­మ్‌­దే­వ్‌ సమా­జా­ని­కి సేవ చే­స్తు­న్నా­ర­ని కొ­ని­యా­డా­రు. బాబా రా­మ్‌­దే­వ్‌ వి­విధ రం­గా­ల్లో తన సే­వ­లు వి­స్త­రిం­చా­ర­ని గు­ర్తు­చే­శా­రు. ఏపీ­లో వె­ల్‌­నె­స్ సెం­ట­ర్లు ఏర్పా­టు చే­యా­ల­ని బాబా రా­మ్‌­దే­వ్‌­ను కో­రు­తు­న్నా­న­ని తె­లి­పా­రు. బాబా రా­మ్‌­దే­వ్‌ స్ప­ష్ట­మైన ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కె­ళ్తా­ర­ని స్ప­ష్టం చే­శా­రు. పర్యా­టక శా­ఖ­కు సల­హా­దా­రు­గా ఉం­డా­ల­ని బాబా రా­మ్‌­దే­వ్‌­ను సీఎం చం­ద్ర­బా­బు కో­రా­రు. యోగా గు­రు­వు రామ్ దేవ్ బాబా మా­ట్లా­డు­తూ, ఏపీ పర్యా­టక రం­గా­ని­కి బ్రాం­డ్ అం­బా­సి­డ­ర్​­గా వ్య­వ­హ­రిం­చ­డా­ని­కి తాను సి­ద్ధం­గా ఉన్నా నని స్ప­ష్టం చే­శా­రు. ఉత్తర భా­ర­త్ వా­సు­ల­కు ఏపీ­లో ఉన్న పర్యా­టక ప్రాం­తా­లు చాలా తె­లి­య­వ­ని, వాటి గు­రిం­చి పరి­చ­యం చే­యా­ల­ని తాను భా­వి­స్తు­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. యోగా ఆయు­ర్వేద, నే­చు­రో­ప­తి లాం­టి అం­శా­ల­ను పర్యా­టక ప్రాం­తా­ల్లో అవ­స­ర­మ­ని గు­ర్తు చే­శా­రు. హా­ర్సి­లీ హి­ల్స్, అరకు, వి­శాఖ, రా­జ­మ­హేం­ద్ర­మ­రం, పి­చ్చుక లంక, సూ­ర్య­లంక లాం­టి మంచి ప్రాం­తా­లు ఉన్నా­య­ని వి­వ­రిం­చా­రు.

టెక్నాలజీ ద్వారా జీరో క్రైం..

ర్యా­పి­డో వ్య­వ­స్థా­ప­కులు మన గుం­టూ­రు­కు చెం­దిన వా­రే­న­ని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. యాప్ ద్వా­రా ఆటో­ల­ను అను­సం­ధా­నం చేసి ప్ర­యాణ సే­వ­లు అం­ది­స్తు­న్నా­ర­ని... ఇప్పు­డు అది బి­లి­య­న్ డా­ల­ర్ల కం­పె­నీ గా మా­రిం­ద­న్నా­రు. వి­నూ­త్నం­గా ఆలో­చి­స్తే ప్ర­పం­చా­న్ని శా­సిం­చే అవ­కా­శం వస్తుం­ద­న్నా­రు. " టె­క్నా­ల­జీ ద్వా­రా జీరో క్రైం సా­ధ్యం. ఆడ­బి­డ్డ­ల­ను వే­ధి­స్తే అదే వా­రి­కి చి­వ­రి రోజు కా­వా­లి. వై­ఎ­స్‌ వి­వే­కా­నం­ద­రె­డ్డి హత్య­లో అసలు వి­ష­యం గూ­గు­ల్ టే­కౌ­ట్ ద్వా­రా బయ­టి­కొ­చ్చిం­ది. సాం­కే­తి­కత సరి­గ్గా వి­ని­యో­గిం­చు­కుం­టే ఫలి­తా­లు వస్తా­యి. మాజీ సీఎం తె­నా­లి­కి వచ్చి గం­జా­యి బ్యా­చ్ ను పరా­మ­ర్శిం­చా­రు. ప్ర­జ­ల­ను వే­ధిం­చే వా­రి­ని అలా­గే వది­లే­యా­లా. ఒక­ప్పు­డు రౌడీ పక్కన ని­ల­బ­డా­లం­టే రా­జ­కీయ నా­య­కు­లు సి­గ్గు పడే­వా­రు. ఇప్పు­డు రౌ­డీ­లు రా­జ­కీయ నా­య­కు­లు­గా మా­రా­రు. తప్పు చే­సిన వా­రి­కి శి­క్ష తప్ప­దు’’ అని చం­ద్ర­బా­బు హె­చ్చ­రిం­చా­రు.

Tags:    

Similar News

TG: యమ"పాశం"