CM Jagan: ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశం
CM Jagan: రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడంతో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.;
CM Jagan: ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. సుదీర్ఘ కాలం తర్వాత ఏపీ సీఎం జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు ప్రధాని. ప్రధానితో సమావేశంలో వ్యక్తిగత సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చించారని సమాచారం. పోలవరం, విభజన సమస్యలు, అప్పులు, తాకట్లు, ఆర్థిక ఇబ్బందులు సహా ఇతర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రెబల్ ఎంపీ రఘురామ ఎపిసోడ్ పైనా చర్చించారని సమాచారం. ఇక సాయంత్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు సీఎం జగన్. రేపు ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోనూ సమావేశం కానున్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరడం, రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడంతో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.