జగన్.. సీమ పౌరుషం ఏమైంది? : తులసీరెడ్డి
ఏపీ సీఎం జగన్..... ప్రధాని నరేంద్ర మోదీని శరణుకోరి .... సాగిలపడ్డారంటూ ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి. పులివెందులకు, ఢిల్లీకి పోటీ అంటూ..;
ఏపీ సీఎం జగన్..... ప్రధాని నరేంద్ర మోదీని శరణుకోరి .... సాగిలపడ్డారంటూ ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి. పులివెందులకు, ఢిల్లీకి పోటీ అంటూ ఓ సారి ఎంపీగా గెలిచిన జగన్... సీమ పౌరుషం ఏమైందని నిలదీశారు. 25 ఎంపీలను ఇస్తే.. హోదా తెస్తానన్న జగన్.. 23 ఎంపీలు ఉన్నా ఎందుకు తేలేకపోయారంటూ ప్రశ్నించారు. స్వయంగా వ్యాపారవేత్త అయిన జగన్... రాజకీయాలతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. పోలవరం విషయంలో ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేయకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకోవాలని సలహా ఇచ్చారు తులసీరెడ్డి.