Pawan kalyan:స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ల్ సమీక్షలో డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన అధికారులు
ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లే, నిధులు మళ్లింపుపై పవన్ కల్యాణ్ విస్మయం;
2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్తుపోయారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు.. ఇక, ఈ సమావేశంలో.. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ పని తీరుపై డిప్యూటీ సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు.. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై ఆయన ఆరా తీశారు.. గత ఐదేళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన రూ.1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ.. స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదనే విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఇక, ఈ సమీక్షా సమావేశంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి..
గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల నిధులు పక్క దారి పట్టినట్టు గుర్తించారు పవన్ కల్యాణ్.. ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో ఎన్ని నిధులున్నాయని ఆరా తీశారు పవన్ కల్యాణ్.. అయితే, ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు పవన్.. అవి కూడా ఐదు నెలల జీతాలకే సరిపోతాయని అధికారులు వెల్లడించడంతో 2020-21 ఏడాదిలో రూ.2092 కోట్ల మేర నిధులుంటే.. ఇప్పుడు ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు.. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారంటూ సీరియస్ అయ్యారు.. నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..