AP: ఊరూరా ఘనంగా రైతన్న మీ కోసం

రాష్ట్రవ్యాప్తంగా రైతన్న మీకోసం ఆరంభం... పంచ సూత్రాలతో సరికొత్త ప్రణాళిక అమలు... రైతుల సమస్యలు తెలుసుకున్న నేతలు

Update: 2025-11-25 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 'రై­త­న్న మీ­కో­సం' కా­ర్య­క్ర­మం ఘనం­గా ఆరం­భ­మైం­ది. సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శా­ను­సా­రం రా­ష్ట్ర వ్య­వ­సాయ శాఖ అధి­కా­రు­లు మొ­త్తం 7 రో­జుల పాటు వి­విధ రకాల కా­ర్య­క్ర­మా­ల­ను ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. సో­మ­వా­రం ఆరం­భ­మై ఈ నెల 29 వరకు వ్య­వ­సాయ అధి­కా­రు­లు ప్ర­తి రైతు ఇం­టి­కి స్వ­యం­గా వె­ళ్లి రై­తుల సమా­చా­రా­న్ని సే­క­రి­స్తు­న్నా­రు. వ్య­వ­సాయ అధి­కా­రు­లు రై­తు­ల­ను సాం­ప్ర­దా­యం­గా వస్తు­న్న పంటల సా­గు­ను కా­కుం­డా, నూతన, లా­భ­దా­య­క­మైన పంటల వైపు అడు­గు­లు వే­సే­లా ప్రో­త్స­హిం­చి, సి­ద్ధం చే­స్తు­న్నా­రు. మా­ర్కె­ట్ ధరలు ఎప్ప­టి­క­ప్పు­డు తె­లు­సు­కుం­టూ, దా­ని­కి అను­గు­ణం­గా పంట మా­ర్పి­డి చే­సు­కు­నే వి­ధా­నం­పై రై­తు­ల­కు అవ­గా­హన కల్పి­స్తా­రు. దీం­తో పా­టు­గా, పంటల సా­గు­లో ఎరు­వు­లు, పు­రు­గు మం­దుల వా­డ­కా­న్ని తగ్గిం­చ­డం వంటి వా­టి­పై కూడా రై­తు­ల­కు అవ­గా­హన కల్పి­స్తు­న్నా­రు.

పంచ సూ­త్రాల ద్వా­రా­నే రై­తుల అభి­వృ­ద్ధి సా­ధ్య­మ­వు­తుం­ద­ని రా­ష్ట్ర వ్య­వ­సాయ శాఖ అచ్చె­న్నా­యు­డు అన్నా­రు. సో­మ­వా­రం ఘం­ట­సాల గ్రా­మం­లో రై­త­న్న మీ కోసం కా­ర్య­క్ర­మం ప్రా­రం­భిం­చా­రు. ఈ సం­ద­ర్బం­గా ము­గ్గు­రు రై­తు­ల­తో మా­ట్లా­డా­రు. సా­గు­నీ­రు, పం­ట­ల­కు గి­ట్టు­బా­టు ధర, యాం­త్రీ­క­రణ, పుడ్ ప్రా­సే­సిం­గ్ యూ­ని­ట్లు, ప్ర­భు­త్వం నుం­చి మద్ద­తు ధర కల్పి­స్తు­న­ట్టు తె­లి­పా­రు. రా­ష్ట్ర ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు రైతు సం­క్షే­మం కోసం కృషి చే­స్తు­న­ట్టు తె­లి­పా­రు.ఇటీ­వల మొం­దా తు­ఫా­ను కా­ర­ణం­గా నష్ట­పో­యిన పంట వి­వ­రా­లు నమో­దు చే­సి­న­ట్టు తె­లి­పా­రు. నీటి సం­ఘా­ల­ను ని­య­మిం­చిన రై­తు­ల­కు మేలు చే­శాం అన్నా­రు. రై­తు­ల­కు అవ­స­ర­మైన సబ్సి­డీ పరి­క­రా­లు అం­ది­స్తు­న­ట్టు చె­ప్పా­రు. అన్న­దాత సు­ఖీ­భవ పథకం కింద రూ. 14 వేలు జమ చే­సి­న­ట్టు తె­లి­పా­రు.

 సిబ్బంది, పంచ సూత్రాల అమలు

ఈ కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా, రైతు సేవ కేం­ద్రం­లో పని­చే­సే అగ్రి­క­ల్చ­ర్ అసి­స్టెం­ట్‌­తో పాటు ఆరు­గు­రు సచి­వా­లయ సి­బ్బం­ది ప్ర­తి ఇం­టి­కి వె­ళ్లి రై­తుల సమా­చా­రా­న్ని సే­క­రి­స్తా­రు. అలా­గే, 'పంచ సూ­త్రా­ల' అమ­లు­పై రై­తు­ల­కు అధి­కా­రు­లు అవ­గా­హన కల్పి­స్తా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో ప్ర­భు­త్వం ప్ర­కృ­తి వ్య­వ­సాయ అధి­కా­రు­ల­ను కూడా భా­గ­స్వా­మ్యం చే­సిం­ది. ఈ అధి­కా­రు­లు ప్ర­కృ­తి వ్య­వ­సా­యం వైపు రై­తు­ల­ను మళ్లిం­చే­లా తగిన సూ­చ­న­లు చే­య­ను­న్నా­రు. ప్ర­తి మూడు కు­టుం­బా­ల­ను ఒక క్ల­స్ట­ర్‌­గా వి­భ­జిం­చి.. ఒక్కొ­క్క బృం­దం రో­జు­కు 30 క్ల­స్ట­ర్లు (90 గృ­హా­లు) సం­ద­ర్శిం­చే­లా ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. నవం­బ­ర్ 24 నుం­చి 29 వరకు అధి­కా­రుల బృం­దా­లు రై­తుల ఇళ్ల­కు వె­ళ్లి సీఎం సం­దేశ లేఖ, కర­ప­త్రం అం­ద­జే­స్తా­రు.     ఏపీ­ఏ­ఐ­ఎం­ఎ­స్‌ యా­ప్‌ వి­ని­యో­గం­పై అన్న­దా­త­ల­కు అవ­గా­హన కల్పి­స్తా­రు. ఈ క్ర­మం­లో రై­తుల నుం­చి సూ­చ­న­లు, ఫి­ర్యా­దు­లు అధి­కా­రు­లు స్వీ­క­రి­స్తా­రు.

Tags:    

Similar News