AP: ఉచిత బస్సు ప్రయాణం- మార్గదర్శకాలు జారీ
స్త్రీ శక్తి మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్.. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు.. ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత బస్సు జర్నీ;
రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్ట్ 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు వర్తించనుంది. ప్రయాణానికి ముందు సరైన గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.
ఈ బస్సులో వర్తించదు
నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు. బసుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా స్సుఅవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్సుల్లో రద్దీ పెరగడం వల్ల అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకుంటోంది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే బస్టాండ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేలా ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హెల్ప్‌లైన్, లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా త్వరలో తాజా వివరాలకు